ఆ రెండు పార్టీల పై భద్రాద్రి వాసుల ఫైర్ కారణం ఇదే

రాష్ట్ర రాజదాని గ్రేటర్ ఎన్నికల్లో లోకల్ సమస్యలే కాకుండా పక్క సమస్యలు కూడ చర్చకు వస్తున్నాయా.. ఎన్నికల్లో భద్రాద్రి రామయ్య ప్రధాన అంశంగా కూడ చేరాడా అంటే అవుననే అనిపిస్తోంది. అయితే రెండు ప్రధాన పార్టీ లు భద్రాచలం గురించి గ్రేటర్ లో చర్చించుకుంటున్నప్పటికి.. ఆరెండు పార్టీలే అసలు భద్రాచలంకు అన్యాయం చేశారంటున్నారు భద్రాద్రి వాసులు…

తెలంగాణ లో ప్రముఖ దేవాలయం భద్రాచలం లోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం. దక్షిణానికి అబిముఖంగా అయోద్య ఉంటే.. ఉత్తరానికి అభిముఖంగా భద్రాచలంలోని రామాలయం ఉంది. ఈ రామాలయాన్ని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రెండు నిర్లక్ష్యంగా చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల తెలంగాణ ఏర్పాటు వల్ల భద్రాచలం రామాలయానికే కాదు.. భద్రాచలం పరివాహక ప్రాంతానికి గిరిజనులకే అన్యాయం జరిగిందనేది వాదన ఉంది. తెలంగాణ విభజన వల్ల ఏపీ న్యాయం చేయడం కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను ఆంధ్రలో కలపుతు ఆప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దానిని బిజెపి ప్రభుత్వం అమలు చేసింది.

భద్రాచలానికి చెందిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపారు. దీని వల్ల భధ్రాచలం పట్టణానికి అన్యాయం జరిగింది. భద్రాచలం పట్టణం కుచించకుపోయి భద్రాచలం రామాలయానికి నష్టం జరిగింది. రామయ్య ఆస్తులన్ని ఆంధ్రలోకి వెళ్తే.. భద్రాచలం రామయ్యకు అన్యాయం చేసింది బిజెపి కాదా అని టిఆర్ఎస్ నేతలు జిఎచ్ ఎంసి ఎన్నికల్లో ప్రశ్నిస్తున్నారు. అయోద్యలో రామయ్య కు పెద్ద గుడినే కడితే భద్రాద్రి రామయ్యను పట్టించుకునే దిక్కే లేదని.. తెలంగాణ రామాలయాన్ని పట్టించుకోని బిజెపి కి ఓట్లు అడిగే అర్హత లేదని ప్రచారంలో టిఆర్ఎస్ వాదించింది.

టిఆర్ఎస్ వాదనను బీజేపీ కూడా అలాగే తిప్పికొట్టింది. ఆరున్నర ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం ఆలయానికి చేసిందేమిటని ప్రశ్నిస్తోంది. తెలంగాణ లోని అన్ని దేవాలయాలను అభివృద్ది చేస్తున్నప్పటికి భద్రాచలం ఆలయంపై అధికార పార్టీ శీత కన్ను వేసింది నిజం కాదా అంటుంది. ఇప్పటికే ఆరు సార్లు శ్రీరామ నవమి జరిగితే ఒక్క సారి మాత్రమే సీఎం కెసిఆర్ వచ్చారని …భద్రాచలం శ్రీరామ నమమి కళ్యాణానికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను తీసుకుని వచ్చే సాంప్రదాయానికి కూడ టిఆర్ ఎస్ తిలోదకాలు ఇవ్వలేదా అని బిజెపి ప్రశ్నిస్తుంది. వంద కోట్లు భద్రాచలం ఆలయానికి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయ కూడ విదల్చలేదని టీఆర్ఎస్ పై ఫైరయింది.

అయితే ఈ రెండు పార్టీలు కూడ భద్రాచలంకు చేసిందేమి లేదని భద్రాచలం వాసులుఅంటున్నారు. బిజెపి ,టిఆర్ఎస్ రెండు పార్టీలు మాకు చేసిందేమి లేదని రెండు పార్టీలు కూడా భద్రాద్రి పై శీతకన్నే వేశాయని మండిపడుతున్నారు. మొత్తానికి భద్రాచలం మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో హాట్ హాట్ గా చర్చకు ఆస్కారం ఇచ్చింది.