భట్టి భజన..ఎక్కడో తేడా కొడుతోంది?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా బీజేపీ ఏ విధంగా ఫైర్ అవుతుందో అందరికీ తెలిసిందే…అధికార టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఫైర్ అవుతుంది. ఇలా ఇలా తమపై బీజేపీ ఫైర్ అవుతుండటంతో..కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఫైర్ అవుతున్నారు. మోదీ సర్కార్ టార్గెట్‌గానే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. అలాగే జాతీయ పార్టీ పెట్టి..జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని చూస్తున్నారు.

అందుకే మోదీ సర్కార్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా మోదీ ప్రభుత్వం టార్గెట్ గానే మాట్లాడారు. అసెంబ్లీలో కేంద్రం విద్యుత్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో విద్యుత్ బిల్లుపై కేసీఆర్‌తో సహ టీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేశారు. విద్యుత్ మీటర్లకు మోటార్లు అమర్చటం దారుణం అంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ..అసలు ఈ విషయంపై చర్చే అవసరం లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని అన్నారు.

ఇదే సమయంలో విద్యుత్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ…పూర్తిగా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కవిమర్శ కూడా చేయలేదు. భట్టి విక్రమార్క కేంద్రాన్ని విమర్శించటంతో సీఎం కేసీఆర్ భట్టిని పొగిడారు. ధన్యవాదాలు తెలిపారు. అలాగే అదానీ, అంబానీలకు ప్రభుత్వ సంస్థలని ధారాదత్తం చేస్తున్నారని, డబుల్ ఇంజిన్‌తో జనాలని చంపుతున్నారని భట్టి మాట్లాడారు.

అసలు భట్టి పూర్తిగా కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు..దీంతో కేసీఆర్‌కు భట్టి భజన చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్ అయ్యారు. అందులో వాస్తవాలని బట్టి రెండు భట్టి న్యూట్రల్‌గా మాట్లాడాల్సి ఉంటుంది…కానీ ఆయన వన్ సైడ్ గా కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో కేసీఆర్ కాలుస్తున్నారని ప్రచారం జరుగుతుంది..ఇలాంటి తరుణంలో భట్టి భజన మరిన్ని అనుమానాలు రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news