నిరుద్యోగులను మోసం చేయడానికి ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయ్‌: భట్టి

-

కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఈ రెండు పార్టీలు నిరుద్యోగులు, యువతను మోసం చేయడానికి మేమంటే మేమని పోటీ పడుతున్నాయని కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని బీజేపీ నాయకులు.. కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇయ్యలేదని టీఆర్‌ఎస్‌ నాయకులు ఒకరిపై ఒకరు విరమ్శలు గుప్పించుకుంటూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

batti
batti

రెండు పార్టీలు చర్చకు రావాలి..

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఎవరెన్ని ఉద్యోగాలు ఇచ్చారో భహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.
లేబర్‌ బ్యూరో లెక్కల ప్రకారం జాతీయ నిరుద్యోగ రేటు 21.6 శాతం ఉండగా, తెలంగాణలో 33.9 నిరుద్యోగ శాతం ఉందన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మరోసారి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యోగాల నియామకాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు గుణపాఠం చెప్పాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు ప్రజల వద్దకు వచ్చి మేం ఇది ఇచ్చాం.. అది చేశామని ఉత్తుతి హామీలిచ్చి ఓట్లు దండుకుంటున్నారని «ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్, బీజేపీల అరాచకాలు రాష్ట్ర ప్రజలు గ్రహించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పదన్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news