40 ఏళ్ల అనుభ‌వానికి ఇది ఏ రేంజ్ ప‌రాజ‌యం అంటే…!

-

మీరు చేసినంత మాత్రాన మండ‌లి ర‌ద్ద‌యిపోతుందా?- గ‌డిచిన రెండు రోజులుగా టీడీపీ ఎమ్మెల్సీలు, నాయ కులు , ఆ పార్టీ అదినేత చంద్ర‌బాబు కూడా ప్రశ్నిస్తున్న‌ది ఇదే! నిజ‌మే. అసెంబ్లీ త‌న డ్యూటీని పూర్తి చేసిం ది. ఇప్పుడు కేంద్రం ప‌రిధిలోకి వెళ్లింది. అయితే, రాజ‌కీయాల్లో నైతిక‌త అనేది ఒక‌టి ఉంది క‌దా! మ‌రి దాని విష‌యం చూసిన‌ప్పుడు .. అస‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మండ‌లి ర‌ద్దు అనే ప్ర‌తిపాద‌నను తీసుకురావ డంతోనే చంద్ర‌బాబు సీనియార్టీపై మ‌చ్చ‌లు ప‌డ్డాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

గ‌డిచిన ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించి త‌మ ప్ర‌తాపం చూపించారు. దీంతో 23 కి ప‌రిమిత‌మైంది టీడీపీ బ‌లం. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ మండ‌లిని ఓడించి మొత్తానికే సున్నా చుట్టారు. ఇది నైతికంగా చంద్ర‌బాబు మ‌రో ప‌రాజ‌యం కాదనే సాహ‌సం ఎవ‌రూ చేయ‌డం లేదు. నిజానికి అసెంబ్లీలో క‌న్నా కూడా చంద్ర‌బాబు మండ‌లిలో మంచి మెజారిటీ, బ‌లం కూడా ఉన్నాయి.

చైర్మ‌న్ కూడా టీడీపీకి చెందిన నాయ‌కుడే. అయినా కూడా చంద్ర‌బాబు.. విచ‌క్ష‌ణ‌ను మ‌రిచిపోయి.. మండ‌లిని హ‌ద్దులు దాటించే ప్ర‌య‌త్నం చేశారు. ఫ‌లితంగా త‌న‌కు అవ‌కాశం లేద‌ని అంటూనే చైర్మ‌న్‌.. వికేంద్రీక‌ర‌ణ బిల్లును, సీఆర్ డీఏ ర‌ద్దు బిల్లును కూడా విచ‌క్ష‌ణ పేరుతో సెల‌క్ట్ క‌మిటీకి పంపారు.
ఈ ప‌రిణామం.. నిజంగా ప్ర‌భుత్వంలో ఉన్న ఏ నాయ‌కుడికైనా ఆగ్ర‌హం తెప్పించేదే. ఇదే ప‌రిణామం తెలంగాణ‌లో జ‌రిగినా ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే చ‌ర్య‌లు ఉండేవి. బ‌య‌ట‌, లోప‌లా కూడా ప్ర‌త్య‌ర్థుల‌పై క‌క్ష సాధింపు ఎక్కువ‌గానే ఉండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, ఏపీలో మాత్రం బ‌య‌ట ఎలా ఉన్న‌ప్ప‌టికీ..కేవ‌లం స‌భ‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు జ‌గ‌న్‌. ఇది నైతికంగా టీడీపీ ప‌రాజ‌యం కాక మరేంటో చంద్ర‌బాబు చెప్పాలి. ఎప్పుడో కేంద్రం అంగీక‌రించి ఈ ర‌ద్దు తీర్మానాన్ని ఆమోదిస్తేనే క‌దా! అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నా.. ఆయ‌న సీనియార్టీకి ఇప్పుడు జ‌రిగిన ప‌రాభ‌వం చాల‌నేది నిపుణుల మాట‌..!!

Read more RELATED
Recommended to you

Latest news