తిరుపతి ఎన్నికలకు ముందు వైసీపీకి బిగ్ షాక్ ఇది…?

-

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్న అధికార వైసిపికి ఇబ్బందికరంగా మారింది. 22 మంది ఎంపీలు ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ పోరాటం చేయలేకపోవడం టీడీపీ ఎంపీ నేరుగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కాస్త మైలేజ్ తీసుకు వచ్చే అంశంగా చెప్పుకోవాలి.

తిరుపతి పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం కాస్త వైసీపీ ని ఇబ్బంది పెట్టవచ్చు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి సాక్షిగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ విషయంలో ప్రధానమంత్రి మోడీ ముందుకు వెళ్ళలేదు. సరిగ్గా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేయడంతో బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు.

వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక పార్లమెంట్ సమావేశాల్లో వైసిపి ఎంపీలు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆ పార్టీకి ప్రధాన సమస్యగా మారిందనే భావన ఉంది. మరి ఇప్పుడు అయినా సరే పార్లమెంట్లో మాట్లాడతా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news