బెజవాడ టీడీపీలో బిగ్ ట్విస్ట్…బాబుకు భారీ షాక్ తప్పదా!

-

మొదట నుంచి బెజవాడలో రాజకీయాలు హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. ఇక్కడ గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీలో రచ్చ నడుస్తోంది. అసలు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు అసలు పడటం లేదనే సంగతి తెలిసిందే. వీరి వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. అయితే ఈ గ్రూప్ తగదాల నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని…ఈ మధ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

chandrababu naidu

ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు. అలాగే తన కుమార్తె శ్వేత కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీలో మాత్రం ఉంటానని అన్నారు. ఎప్పుడైతే నాని ఈ ప్రకటన చేశారో..అప్పటినుంచి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టి‌డి‌పి కార్యకర్తలు..కేశినేనిని పోటీ నుంచి తప్పుకోవద్దని కోరుతున్నారు. కార్యకర్తలు, నాయకులు కేశినేనిని బ్రతిమాలాడుతున్నారు గానీ, చంద్రబాబు మాత్రం కేశినేనిని పట్టించుకోలేదు.

ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినా సరే లైట్ తీసుకున్నట్లు కనిపించారు. ఈ క్రమంలో బెజవాడ టి‌డి‌పిలో బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది….కేశినేని టీడీపీని వీడుతున్నారని ప్రచారం మొదలైంది. ఆయన అతి త్వరలోనే బి‌జే‌పిలో చేరబోతున్నారంటూ కథనాలు వచ్చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే విజయవాడలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫోటోలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టి‌డి‌పి నేతల ఫోటోలు కూడా మాయమయ్యాయి. అక్కడ కేశినేని…రతన్ టాటాతో ఉన్న ఫోటో, పలు సేవ కార్యక్రమాలు చేస్తున్న ఫోటోలు మాత్రమే ఉన్నాయి.

అలాగే కేశినేని…సోషల్ మీడియా ఖాతాల్లో కూడా టి‌డి‌పి కనబడట్లేదు. దీని బట్టి చూస్తే కేశినేని….టి‌డి‌పిని వీడటం ఖాయమే అని తెలుస్తోంది. అయితే బి‌జే‌పిలో చేరడం వల్ల ప్రస్తుతానికి కేశినేనికి లాభమే…అది కూడా వ్యాపార పరంగా, కానీ రాజకీయంగా ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే విజయవాడలో బి‌జే‌పికి అంత సీన్ లేదు. ఒకవేళ నెక్స్ట్ పోటీ చేయనని అంటున్నారు కాబట్టి, ఈ రెండున్నర ఏళ్ళు బండి లాగించవచ్చని అనుకుని కేశినేని బి‌జే‌పిలో చేరే అవకాశాలు లేకపోలేదు. మరి చూడాలి కేశినేని…బాబుకు భారీ షాక్ ఇస్తారో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news