బాబుని కలిశాక పవన్ వీక్..బీజేపీతోనే అధికారం..!

-

ఏపీలో జనసేన-బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పేరుకే పొత్తు గాని ఎప్పుడు కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ముందుకెళుతున్నారు. చాలా రోజుల కిందటే పవన్..బీజేపీని రూట్ మ్యాప్ అడిగారు..కానీ పెద్దగా స్పందించలేదని ఆ తర్వాత పవన్ చెప్పిన సందర్భం ఉంది. ఇదే సమయంలో ఆ మధ్య చంద్రబాబు వచ్చి పవన్‌ని కలవడం, ఇప్పుడు తాజాగా పవన్ వెళ్ళి బాబుని కలవడంతో రాజకీయం మారిపోయింది.

టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైందని ప్రచారం మొదలైంది. ప్రచారం ఏముంది గాని పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ పొత్తులో బీజేపీ ఉంటుందో లేదో క్లారిటీ లేదు. పైగా చంద్రబాబుతో కలిసే ప్రసక్తి లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయితే బీజేపీ కలిసొస్తే పర్లేదు..లేదంటే పవన్..వదిలేసి టీడీపీతో కలిసి ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా బాబు-పవన్ భేటీపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది గాని..బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు.

 

కానీ తాజాగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు..ఇక ఈయన  వైసీపీకి అనుకూలంగా ఉంటారని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తూ ఉంటాయి. ఈ విషయం పక్కన పెడితే..బాబుని కలవడం వల్ల పవన్ వీక్ అవుతారని కామెంట్ చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప్ర‌త్య‌ర్థులు సోష‌ల్ మీడియా, ప్ర‌ధాన మీడియాలో సాగిస్తున్న ప్ర‌చారంతో త‌ప్ప‌కుండా జ‌న‌సేనానికి న‌ష్టం క‌లుగుతుంద‌ని, ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుల్ని ఈ భేటీ బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

బీజేపీ-జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని, ఈ సారి వైసీపీ-టీడీపీలని ప్ర‌జ‌లు ఎన్నుకోర‌ని, బీజేపీ-జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తార‌ని చెప్పుకొచ్చారు. అలాగే త‌మ‌లో ఒక‌ర్ని సీఎంగా చూడాల‌ని కాపులు కోరుకుంటున్నార‌ని , బీజేపీతో జ‌న‌సేన పొత్తులో ఉంటే ప‌వ‌న్‌కు ముఖ్య‌మంత్రి అవకాశం వ‌స్తుంద‌ని, టీడీపీతో వెళితే ఆ అవ‌కాశం వుండ‌ద‌ని విష్ణు చెప్పుకొచ్చారు. అంటే టీడీపీతో పవన్ కలవడం బీజేపీకి ఇష్టం లేదు. మరి రానున్న రోజుల్లో ఈ పొత్తు ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news