కమలం ఎన్నికల శంఖారావం..సక్సెస్ అవుతుందా?

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నుంచే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో గెలవాలని చెప్పి అటు అధికార బి‌ఆర్‌ఎస్ గట్టిగా ప్రయత్నిస్తుంది. ముచ్చటగా మూడోసారి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇక బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ సారైనా అధికారం సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది.

అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణపై బి‌జే‌పి ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. కేంద్రంలోని నేతలు పూర్తిగా కర్నాటకతో పాటు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..కర్నాటకతో పాటు తెలంగాణలో కూడా గెలుస్తామని అంటున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమయ్యారు. చేవెళ్ళలో భారీ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అమిత్ షా సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

అయితే దీంతోనే ఎన్నికల శంఖారావం పూరించాలని షా చూస్తున్నారు. అందుకే ఈ సభని భారీ స్థాయిలో సక్సెస్ చేయాలని బి‌జే‌పి నేతలు చేస్తున్నారు. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించాలని బండి సంజయ్ ప్లాన్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తారని, చేవెళ్లలో భారీ స్థాయిలో సభ సక్సెస్ అవుతుందని అంటున్నారు.

కాకపోతే వర్షం వచ్చే సూచనలు ఉండటంతో సభని పకడ్బందీగా చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలో బి‌జే‌పికి సరికొత్త ఊపు తీసుకురావాలనేది బండి ప్లాన్. ఈ సభ సక్సెస్ అయితే ఇంకా ఎన్నికల రణరంగంలో దూకుడుగా వెళ్లవచ్చని భావిస్తున్నారు. చూడాలి మరి అమిత్ షా సభ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news