సిరిసిల్లపై కమలం ఫోకస్.. కేటీఆర్‌ని ఆపగలరా?

-

రాజకీయాల్లో హేమాహేమీలని ఓడించడం అనేది ఎప్పుడో అరుదుగా జరుగుతూ ఉంటుంది…బలమైన ఇమేజ్ ఉన్న నాయకులని ఓడించడం అసాధ్యమైన పని…ఉదాహరణకు పులివెందులలో జగన్, కుప్పంలో చంద్రబాబు, గజ్వేల్‌లో కేసీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కేటీఆర్‌ని ఓడించడం జరిగే పని కాదు..కొద్దో గొప్పో వీరి మెజారిటీలని తగ్గించడం సాధ్యం అవుతుంది గాని…ఓడించడం అనేది చాలా కష్టమైన పని. కాకపోతే రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం ఓడిస్తామని స్టేట్‌మెంట్స్ ఇస్తారు.

గత ఎన్నికల ముందు పులివెందులలో జగన్‌ని ఓడిస్తామని టీడీపీ నేతలు శపథం చేశారు..కానీ తీరా చూస్తే ఎన్నికల్లో జగన్ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచారు..ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీ అనుకున్నంత ఈజీగా బాబుని ఓడించలేరు..కుప్పంలో బాబుని ఓడించడం సులువు కాదు. ఇటు వస్తే గజ్వేల్‌లో కేసీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావుని సైతం ఓడించడం జరిగే పని కాదు…వీరికి ఓటమి దగ్గరకు రాదు.

అలాంటిది కేటీఆర్‌ని ఓడిస్తామని బీజేపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు…సిరిసిల్లలో కేటీఆర్‌కు చెక్ పెడతామని అంటున్నారు. కేసీఆర్ కుమార్తె కవితని ఓడించినట్లే…కుమారుడు కేటీఆర్‌ని ఓడిస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. అంటే అరవింద్ చెప్పినట్లు కేటీఆర్‌కు చెక్ పెట్టడం అంత ఈజీనా అంటే…అబ్బే అసలు కాదనే చెప్పాలి..ఏ మాత్రం సిరిసిల్లలో కేటీఆర్‌ని ఓడించలేరు.

2009 నుంచి కేటీఆర్ సిరిసిల్లని తన కంచుకోటగా మార్చుకున్నారు..2009లో 171 ఓట్లతోనే గెలిచిన..2010 ఉపఎన్నికలో 68 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు..ఇక 2014లో 53 వేలు, 2018 ఎన్నికల్లో 90 వేల మెజారిటీతో గెలిచారు. మరి ఇంత భారీ మెజారిటీలతో గెలిచిన కేటీఆర్‌ని ఓడించడం జరిగే  పని కాదు. పైగా ఆయన నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేశారు.

ఇటు చూస్తే సిరిసిల్లలో బీజేపీకి బలమే కనిపించడం లేదు..అలాంటప్పుడు ఏ ఉద్దేశంతో అరవింద్…కేటీఆర్‌కు చెక్ పెడతామని అన్నారో అర్ధం కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news