ఏపీని ముక్కలు చేసేందుకు బీజేపీ ప్లాన్..?

-

ఏపీలో బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు రాష్ట్రాన్ని మతపరంగా విడగొట్టాలని భావిస్తోంది. ప్రజల్లో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందాలని చూస్తోందా..అంటే అవుననే అనిపిస్తోంది. ఏపీ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ మతపరమైన కోణాలను హైలెట్ చేయడం ద్వారా ఏపీలో తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నస్తున్న కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని కూడా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ……. మత వ్యాప్తి కోసం జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మతమార్పిడిలపై మాట్లాడారు. రాష్ట్రం లో వైసీపీ ప్రతీకార దాడులకు దిగుతోందని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

అదే సమయంలో రాష్ట్రంలో అన్య మత ప్రచారం జరుగుతోందని, బలవంతపు మత మార్పిడిలు, అన్య మత ప్రచారం దారుణమని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. విశాఖ బీజేపీ కార్యాలయం లో కిషన్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. అంతకుముందు.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలోనూ బీజేపీ మత కోణాన్ని హైలెట్ చేసింది.

టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను అక్కడి నుంచి పంపేందుకు ఎల్వీ ప్రయత్నించడం వల్లే… అతడిని జగన్ బదిలీ చేశారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఇలా ప్రతి విషయంలోనూ హిందూ- క్రిస్టియన్ అంటూ విభజన తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో హిందువుల మద్దతు పొందాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఇది వారికి లాభించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం చేటు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news