పాపం తెలంగాణా బిజెపి…!

-

తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అనుకోవడం ఏమో గాని ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఆ పార్టీకి కలిసి రావడం లేదు. రాజకీయంగా ఏదో సాధించేద్దాం అని భావిస్తున్న ఆ నేతలకు కెసిఆర్ వ్యూహాలు ఒక పక్కన చుక్కలు చూపిస్తే సరైన నాయకత్వం లేక ముందుకి స్వేచ్చగా అడుగులు వేయలేకపోతుంది. రాజకీయంగా ఇన్నాళ్ళు దూకుడుగా వెళ్దాం అని భావించిన తెలంగాణా బిజెపి ఇప్పుడు మాత్రం ఇబ్బంది పడుతుంది.

మున్సిపాలిటి ఎన్నికలకు సమయం దగ్గరపడింది. అభ్యర్ధుల ఎంపికలో మాత్రం ఆ పార్టీ దూకుడుగా వెళ్ళడం లేదు. దానికి ప్రధాన కారణం ఖర్చు పెట్టె వాళ్ళు లేకపోవడం ఒక ఇబ్బంది అయితే అసలు నిలబడే వాళ్ళే లేకపోవడం మరో ఇబ్బంది. ఆరు జిల్లాల్లో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు గా నిలబడిన వాళ్ళే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటి చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ ఎంపీ సీటు గెలిచిన అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ లో మినహా ఎక్కడా కూడా అభ్యర్ధులు దొరకడం లేదట.

ఒక పక్క కాంగ్రెస్, తెరాస పోటా పోటీగా అభ్యర్ధులను నిలబెడుతుంటే బిజెపి మాత్రం అభ్యర్ధులే దొరకక ఇబ్బంది పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తేనే బలపడే అవకాశం ఉంటుంది. కాని ఆ పార్టీకి మాత్రం ముందు అడుగు పడటం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనితో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది. ఏ విధంగా దీని నుంచి బయటకు రావాలో అర్ధం కాక తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటలేకపోతే తెలంగాణాను లైట్ తీసుకోవడం బెటర్ అంటున్నారు ఆ పార్టీ నేతలే.

Read more RELATED
Recommended to you

Latest news