బ్రేకింగ్; ఏపీ రాజ్యసభ రేసు నుంచి చిరంజీవి, షర్మిల అవుట్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా రాజ్యసభకు ఎవరిని పంపాలి అనే దానిపై రహస్య కసరత్తులు చేస్తున్న జగన్ కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇన్నాళ్ళు షర్మిల, చిరంజీవి, బీద మస్తాన్ రావు ఇలా పలు పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు వారిని పక్కనబెట్టారు జగన్.

రాజ్యసభ విషయంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు కూడా వైసీపీ నే దక్కించుకోనుంది. అయితే ఆ నాలుగు స్థానాలను నలుగురులో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక ఓసీని ఎంపిక చేయాలని జగన్ భావిస్తున్నారు. దీనితో రాజ్యసభకు ఎన్నిక కాబోయే నేతల విషయంలో సామాజికవర్గ సమీకరణలు కీలకం కానున్నాయి.

ప్పటికే వైసీపీ తరపున రాజ్యసభలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఉన్నారు. షర్మిల, అయోధ్య రామిరెడ్డి పేర్లు వినపడుతున్నాయి. అయోధ్య రామిరెడ్డి జగన్ కి అత్యంత సన్నిహిత వ్యక్తి. దీనితో ఆయనకు అవకాశం ఇవ్వడం ఖాయంగా కనపడుతుంది. ఇక బీసి విషయానికి వస్తే బీద మస్తాన్ రావు కి అవకాశం ఇవ్వనున్నారు. అటు ఓసీ లెక్కలో చూస్తే చిరంజీవికి అవకాశం లేదనే చెప్పాలి. మైనార్టీ నేతలు ఎవరా అనేది చూడాలి. ఎస్సీ నుంచి మోపిదేవి వెంకట రమణ కీలకం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news