అమెరికా నుంచి భారత్ తీసుకునేవి ఇవే…!

-

హైదరాబాద్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది రక్షణ ఒప్పందం. ఇందులో భాగంగా పలు అధునాతన ఆయుధాలను భారత్ కి ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. 24 ఎం హెచ్-60 రోమియో, అపాచీ ఏహేచ్ 64ఈ హెలికాప్టర్లను భారత్ కి ఇవ్వనుంది.

నావీకి రోమియో ఆర్మీ కి అపాచీ హెలికాప్టర్లను ఇవ్వనున్నారు. ఈ రెండు కూడా యుద్ధం సమయంలో చాలా కీలకం కానున్నాయి. రక్షణ శాఖకు సంబంధించి రెండు దేశాల మధ్య మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం జరగనుంది. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. రెండు రకాల హెలికాప్టర్ ల కొనుగోలుకి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆర్ధిక వాణిజ్య సంబంధాలపై మోడీ, ట్రంప్ చర్చలు జరుపుతున్నారు.

ఇటీవల భారత్ కు వాణిజ్య ప్రాధాన్యత హోదా తొలగించిన అమెరికా… నేడు కీలక ఒప్పందాలకు సిద్దమైంది. ఈ ఒప్పందాలపై ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ప్రధానంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ కి ఇక నుంచి భారత్ చుక్కలు చూపిస్తుంది అంటున్నారు పరిశీలకులు. అత్యాధునిక ఆయుధ సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆలోచనలో భారత్ ఉంది. నమస్తే ట్రంప్ ప్రసంగంలో కూడా రక్షణ రంగంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news