ఏ నాయకుడుకైన ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అనేది..పెద్ద విజయంతో సమానం..అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సీటు దక్కించుకోవడమే నేతలకు మొదట విజయంగా భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీలో నేతలకు సీట్ల టెన్షన్ మొదలైంది. ఈ నెలలోనే కేసిఆర్ మొదట లిస్ట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ లిస్టులో తమ పేరు వస్తే బాగుంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీటు ఆశిస్తున్న నేతలు కోరుకుంటున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కేసిఆర్ మొదట లిస్టుని రెడీ చేస్తున్నారు. అయితే 119 సీట్లు ఉంటే అందులో 103 మంది బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేవలం 16 సీట్లలోనే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఎక్కువ ఇవ్వాలి. అయితే కొందరు పనితీరు బాగోలేదని సర్వేల్లో తేలింది. వారికి మళ్ళీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమని తేలింది. ఈ నేపథ్యంలో ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు వస్తుంది..ఎవరికి రాదు? అనే టెన్షన్ నేతల్లో ఉంది.
అదే సమయంలో బిఆర్‌ఎస్ లో కొన్ని గ్రూపులు ఉన్నాయి. డైరక్ట్ గా కేసిఆర్ మనషులు అని చెప్పుకునేవారు ఎక్కువ ఉన్నారు. వారికి కేసిఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది లెక్క. అదే సమయంలో కేటిఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్‌లకు సంబంధించిన మనషులు కూడా ఉన్నారు. వీరి ద్వారా సీట్లు ట్రై చేసే నేతలు బాగానే ఉన్నారు. వీరి రికమండేషన్ ఉంటే సీటు గ్యారెంటీ అని నేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో వారి ద్వారా మొదట లిస్టులోనే తమ పేర్లు వచ్చేలా చూసుకోవాలని కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో మొదట లిస్టులో ఎవరి పేర్లు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది.చూడాలి మరి మొదట లిస్ట్ ఎంతమంది అభ్యర్ధులని ప్రకటిస్తారు..ఎవరికి ఛాన్స్ ఇస్తారో.