జిల్లాల్లో కారుదే ఆధిక్యం..సెకండ్ ఎవరంటే?

-

ఎన్నికలు: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బి‌జే‌పి చూస్తుంది.ఇటు వరుసగా రెండుసార్లు ఓడిపోయి అధికారం కోల్పోయిన కాంగ్రెస్…ఈ సారైనా గెలవాలని చూస్తుంది. ఇక తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బి‌జే‌పి చూస్తుంది. ఇలా ఎవరికి వారు గెలుపుపై ఫోకస్ చేశారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్తితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో చెప్పే పరిస్తితి లేదు. ఈ సారి బి‌ఆర్‌ఎస్ ఈజీ గా గెలవడం కష్టమే..అలా అని కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు తక్కువే..ఇటు బి‌జే‌పికి అదే పరిస్తితి. కాకపోతే మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ మాత్రం జరిగేలా ఉంది. కానీ బి‌ఆర్‌ఎస్ పార్టీనే కాస్త ఆధిక్యంలో ఉందని చెప్పాలి. అన్నీ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి పట్టు ఉంది..కాంగ్రెస్ కు కొన్ని జిల్లాల్లో బలం ఉంటే..బి‌జే‌పికి కొన్ని జిల్లాల్లో బలం ఉంది. మొదట అన్నీ ప్రాంతాల ప్రజలు..ఇతర రాష్ట్రాల ప్రజలు ఉండే హైదరాబాద్ జిల్లా గురించి చూసుకుంటే..ఇందులో ఉన్న 7 సీట్లు ఎం‌ఐ‌ఎం ఇచ్చేయడమే..అవి తప్ప మిగతా సీట్లలో బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య పోటీ కనిపిస్తుంది. రెండు, మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ ఇస్తుంది.

ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందనే చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే ఇక్కడ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంటుంది. ఈ జిల్లాలో బి‌జే‌పి ప్రభావం  తక్కువే. ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్తితి. అటు వరంగల్ జిల్లాలో ఎక్కువ సీట్లలో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే..కొన్ని సీట్లలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పోటీ ఉంది. అటు కరీంనగర్ లో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. మహబూబ్‌నగర్ లో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య కొన్ని సీట్లలో పోటీ ఉంది..కొన్ని సీట్లలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి మధ్య పోటీ ఉంది. మెదక్‌లో త్రిముఖ పోరు ఉంది. నిజామాబాద్‌లో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి మధ్య పోటీ ఉంటుంది. ఆదిలాబాద్ లో త్రిముఖ పోరు ఉంటుంది. అయితే మెజారిటీ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news