దుబ్బాకపై ‘కొత్త’ స్కెచ్..రఘునందన్‌కు చెక్ పెడతారా?

-

దుబ్బాకపై: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉపఎన్నికల్లో దుబ్బాక ఉపఎన్నిక కూడా ఒకటి.బి‌ఆర్‌ఎస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో అనూహ్యంగా బి‌జే‌పి గెలవడం పెద్ద సంచలనం. పైగా బి‌ఆర్‌ఎస్ అధికారంలో ఉంటూ కూడా దుబ్బాకలో గెలవలేకపోయింది. అయితే మొదట్లో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ఈ స్థానంలో తర్వాత నుంచి బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది..రాష్ట్రం వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి రామలింగారెడ్డి గెలిచారు. ఇక ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో..2020లో ఉపఎన్నిక వచ్చింది.

ఈ ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బి‌జే‌పి నుంచి రఘునందన్ రావు గెలిచారు. అక్కడ నుంచే తెలంగాణలో బి‌జే‌పి  బలపడటం మొదలైంది. ఇలా బి‌జే‌పి కైవసం చేసుకున్నా దుబ్బాకని తిరిగి సొంతం చేసుకోవాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ బలమైన అభ్యర్ధిని రంగంలో దించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి..దుబ్బాకలో పోటీ చేయడానికి గ్రౌండ్ రెడీ చేసుకున్నారని తెలిసింది.

ఆయన దుబ్బాకలో గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్త ప్రభాకర్‌కు దుబ్బాకలో పోటీకి కే‌సి‌ఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. అయితే ప్రభాకర్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కే‌సి‌ఆర్..మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నికలో మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ గెలిచారు..2019లో కూడా ఈయనే పోటీ చేసి గెలిచారు.

ఇక నెక్స్ట్ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అక్కడ ఎలాగో రామలింగారెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేదు. దీంతో ఈ సారి దుబ్బాక సీటు ప్రభాకర్‌కే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో రఘునందన్ గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల నాడు ఉండే పరిస్తితి బట్టి..దుబ్బాక రాజకీయం ఉంటుంది. చూడాలి మరి ఈ సారి రఘునందన్‌కు బి‌ఆర్‌ఎస్ చెక్ పెడుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news