రండి రండి దయచేయండి ! మీ రాక మాకు సంతోషమండి !

-

అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో బలం పెంచుకోవడం తో పాటు ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచే ప్రతి విషయం పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. తమ ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులు ఎవరా అనే విషయం పై ఆరా తీస్తూ, వారిని తమ పార్టీలో చేర్చుకునే విషయంపై దృష్టి సారించాయి.
ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చి చేరిన వారి ద్వారా కొన్ని ఓట్లను అయినా, చీల్చవచ్చు అనే అభిప్రాయంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండడం, ఇవి అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో , టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ లలోని కీలక నాయకులను చేర్చుకునే విషయంపై దృష్టిపెట్టగా, ఇక మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఉన్న బిజెపి గ్రేటర్ పీఠం సాధించాలనే ఉద్దేశ్యంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లోని కీలక నాయకులను బిజెపిలో చేర్చుకునే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి.
ప్రస్తుతం డివిజన్లు,  నియోజకవర్గాల వారీగా వలసలను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాయి. టిఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ ,హిమాయత్ నగర్ , బంజారా హిల్స్, వెంకటేశ్వర కాలనీ జూబ్లీహిల్స్ సోమాజిగూడ వంటి ప్రాంతాలను తమ ఖాతాలో  గత గ్రేటర్ ఎన్నికల్లో వేసుకుంది. ఇప్పుడు అక్కడ విజయం సొంతం చేసుకునేందుకు, కాంగ్రెస్ బిజెపిల లోని కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకునే విషయంపై దృష్టి సారించాయి. ఇక టిఆర్ఎస్ సైతం సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని, బీజేపీ ఖచ్చితంగా గ్రేటర్ లో విజయం సాధిస్తుందని, పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి డొఖా ఉండదని , రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే విజయం అని,  పార్టీలోకి వస్తే వివిధ నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం పరిశీలిస్తామని,  ఇలా ఎన్నో రకాలుగా టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇక ఇదే అదునుగా కొంతమంది నాయకులు వివిధ పదవులతో పాటు, సొమ్ములు కూడా ఆశిస్తూ , ఎవరు ఎక్కువ ఇస్తే వారు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు  ఇప్పుడు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అయితే గెలుపు కోసం ఏం చేసేందుకు అయినా, పార్టీలు వెనకాడడం లేదు. ఇలా అన్ని పార్టీలు ఇప్పుడు వలసలపైన ఆశలు పెట్టుకున్నాయి.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news