ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసిన సిబిఐ…?

కడప నగరంలో వైఎస్ వివేకా హత్య కేసుపై విచారణ కొనసాగుతుంది. అప్పట్లో వివేకా తో సన్నిహితంగా వున్న మహిళ తో పాటు మరో మహిళను రెండవ రోజు విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులను, కర్నూలు కు చందిన డాక్టర్ చిన్నన్నను ముగ్గురి ని విచారిస్తున్నారు. ఈ మేరకు సిబిఐ అధికారులు కర్నూలు కూడా వెళ్ళారు.

నేడు మొత్తం ఐదుగురిని విచారిస్తున్న సిబిఐ అధికారులు… త్వరలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే బిజెపి నేత ఆదినారాయణ రెడ్డిని, ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే వివేకా బంధువులు, సహాయకులను సిబిఐ అధికారులు విచారించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించే అంశంపై ఇప్పుడు సందిగ్దత కొనసాగుతుంది.