జగన్-బాబు ఒకేచోటుకు..రాజకీయం అంటే ఇదే.!

-

ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజలని ఆకర్షించేందుకు అటు జగన్, ఇటు చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. గత ఎన్నికల మాదిరిగా ఈ సారి సులువుగా గెలవడం కష్టమే అని జగన్‌కు అర్ధమైంది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఆయన ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల మధ్యలోకి వస్తున్నారు.

బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టి ఈ సారి అధికారం దక్కించుకోవడం కూడా టి‌డి‌పికి అంత సులువు కాదు. పైగా మరోసారి అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి పరిస్తితి అస్సామే. అందుకే ఈ సారి అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు కష్టపడుతున్నారు. ఓ వైపు తన తనయుడుని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి పంపారు. ఇటు తాను కూడా వయసు మీద పడిన ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆయన సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎక్కడకక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.మొదట చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు రానున్నారు. అనంతరం దేవరపల్లిలో బహిరంగ సభకు హాజరవుతారు. రాత్రికి రాజమండ్రిలో బస చేస్తారు. ఇటు జగన్ సైతం పోలవరం వెళుతున్నారు. పోలవరం నియోజకవర్గంలోని కూనవరం మండలంలో వరద ముంపు ప్రాంతాలని పరిశీలిస్తారు. అలాగే వైసీపీ నేతలతో సమావేశమవుతారు. రాత్రికి రాజమండ్రిలో బస చేస్తారు.

ఇలా ఓ వైపు బాబు, మరో వైపు జగన్ పోలవరంలో పర్యటించడం, రాజమండ్రిలో బస్ చేయడం చేయనున్నారు. దీంతో ఒకే చోటుకు ఇద్దరు నేతలు వస్తుండటంతో రెండు పార్టీల శ్రేణులు భారీగా తరలి రావడం ఖాయం. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు పోలీసులు బందోబస్త్ పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు ప్రజా క్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news