కేటీఆర్-రేవంత్‌లపై బాబు కామెంట్! పవన్‌ని వదలలేదు!

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య టీవీ షోల్లో బాగానే హల్చల్ చేస్తున్నారు. ఆ మధ్య బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసిన బాబు..తాజాగా సింగర్ స్మిత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్‌స్టాపబుల్ షోలో తన రాజకీయ ప్రస్థానం, ఎన్టీఆర్‌ని గద్దె దించే ఎపిసోడ్..ఇలా పలు విశేషాలని పంచుకున్నారు. ఇక స్మిత ప్రోగ్రాంలో సైతం ఎన్టీఆర్‌ని ఎందుకు గద్దె దించాల్సి వచ్చింది..ఎవరెవరు అందులో ఉన్నారనే విషయాలని చెప్పారు. ఎన్టీఆర్‌ని గద్దె దించేప్పుడు ఇప్పుడు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు.

అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పా, ఒప్పా అని ఆలోచిస్తే.. ఈరోజు ఆయన బొమ్మ పెట్టుకుని ఏపీలో తెలుగుజాతికి తెలుగు దేశం పార్టీని శాశ్వతంగా అందిస్తున్నామంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. అదే సమయంలో బిల్‌గేట్స్‌ని ఎలా కలిశారు. మైక్రోసాఫ్ట్‌ని హైదరాబాద్‌కు ఎలా తీసుకొచ్చారనే అంశాలని కూడా చెప్పారు. ఇక తన ఫేవరెట్ రాజకీయ నాయకుడు ఎవరనేది బాబు చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఫేవరెట్ రాజకీయ నాయకుడు అని, అలాగే ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అని అన్నారు.

ఇక ఎన్టీఆర్‌ని నటుడిగా కంటే నాయకుడుగానే ఎక్కువ అభిమానిస్తానని బాబు చెప్పుకొచ్చారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ ఉన్న నేతలు పవన్, కేటీఆర్, రేవంత్, లోకేష్‌ల గురించి బాబు ఒక్క మాటలో వివరించారు. పవన్.. సమాజానికి ఏదో చేయాలనే తపన పడతారని అన్నారు. కేటీఆర్.. అనుకున్నది సాధించేందుకు పనిచేసే వ్యక్తి, బెస్ట్ కమ్యునికేటర్ అని, మంచి స్ట్రాటజిస్ట్ అని చెప్పుకొచ్చారు.

ఇక రేవంత్..ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తి అని, కానీ ప్రజల్లో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లోకేష్ సైతం ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news