ధ‌ర్మాబాద్ కోర్టుకు హాజ‌రుకాకూడ‌ద‌ని బాబు నిర్ణ‌యం

-

రీకాల్ పిటిష‌న్ వేయడానికే చంద్ర‌బాబు మొగ్గు

అమ‌రావ‌తి: బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకాకూడ‌ద‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం నిశ్చయించుకున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబునాయుడుతో సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news