తెలంగాణ రాజకీయాలు బాగా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు..అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల చెక్ పెట్టేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణని పార్టీ లోకి తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఆయనకి టీఆర్ఎస్ సభ్యత్వం కూడా ఇచ్చారు. అయితే రమణ టిడిపిలో దాదాపు 30 సంవత్సరాల పైన పని చేస్తూ వస్తున్నారు. బాబుకి అండగా ఉన్నారు. ఏడేళ్లుగా అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడు టిఆర్ఎస్ లో చేరడం పై కాంగ్రెస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషిని విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. పదేళ్లు టిడిపిలో పని చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు మనిషి అయితే, 30 ఏళ్ళు టిడిపిలో పనిచేసిన రమణ సైతం చంద్రబాబు మనిషే అని, ఆయన వెనుక బాబు ఉన్నారని, బాబే, రమణని టిఆర్ఎస్ లోకి పంపిస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.
అలా అనుకుంటే కేసీఆర్ తో సహా చాలామంది మంత్రులు చంద్రబాబు మనుషులే అని మాట్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ వెనక చంద్రబాబు ఉంటే, రమణ వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు కావాలనే రమణని టిఆర్ఎస్ లో పంపించి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ రివర్స్‌లో వస్తుంది. గతంలో పనిచేసిన రాజకీయ పార్టీని తిడుతూ, వేరే పార్టీ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లేరని, తన ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతతో ఉంటారని, కాబట్టి ఇలాంటి విమర్శలు చేయడం తగదు అని చెప్పి మాట్లాడుతున్నారు.