అచ్చెన్నకు బాబు షాక్ ఇస్తారా…?

Join Our Community
follow manalokam on social media

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం లో కూడా కొన్ని మార్పులు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబునాయుడు దృష్టికి పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీలో విభేదాలతో చాలామంది నాయకులు పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా ఒకింత ఇబ్బంది ఫీల్ అవుతున్నారు.

అందుకే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం లో మార్పులు చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జాతీయ కమిటీ లో కూడా కొన్ని మార్పులు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు గా సమాచారం. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలో చాలామంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం టిడిపి వర్గాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది.

దీనితో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనను మార్చే ఆలోచనలో ఉన్నారని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా మంది నాయకులు ప్రచారం చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర అధ్యక్షుడు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించినట్టుగా టిడిపి వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలో చంద్రబాబు నుంచి కొన్ని కీలక ప్రకటన కూడా రావచ్చు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వం లో చంద్రబాబు మార్పులు చేయవచ్చని అంటున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...