ఏపీలో కరోనా భయపెడుతోంది. ఈరోజు నమోదైన కేసులతో కేసులు 9 లక్షలకు చేరాయి. 158 రోజుల్లో ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలకు కరోనా కేసులు చేరాయి. గడచిన 24 గంటల్లో 993 కరోనా కేసుల నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. అత్యథికంగా గుంటూరు జిల్లాలో 198 కేసుల నమోదు అయ్యాయి. గుంటూరు తర్వాత చిత్తూరు, కృష్ణా, విశాఖల్లో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. చిత్తూరులో 179, కృష్ణాలో 176, విశాఖలో 169 కేసులు నమోదయ్యాయి.
137 రోజుల్లో తొలి లక్ష కేసులు నమోదు కాగా, 11 రోజుల్లో లక్ష నుంచి రెండు లక్షల కేసులు నమోదు అయ్యాయి. 11 రోజుల్లోనే రెండు నుంచి మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయి. 3 లక్షల నుంచి 4 లక్షల కేసులకు 4 లక్షల నుంచి 5 లక్షల కేసులకు.. 5 లక్షల నుంచి 6 లక్షల కేసుల నమోదుకు పదేసి రోజుల సమయం పట్టింది. 14 రోజుల్లో 6 లక్షల నుంచి 7 లక్షల కేసుల నమోదు కాగా 7 లక్షల నుంచి 8 లక్షల కేసుల నమోదుకు 22 రోజులు పట్టింది. 8 లక్షల కేసుల నుంచి కరోనా కేసులు నెమ్మదించాయి.