ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలపడటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న ఆ పార్టీని బయటకు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజా చైతన్య యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ద్వారా రాజధాని అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది పక్కన పెడితే యాత్ర మొదలుపెట్టిన వారం రోజుల్లోనే విశాఖ పట్నం విమానాశ్రయంలో ఊహించని విధంగా షాక్ తగిలింది చంద్రబాబుకి. దీనితో ఇప్పుడు ఆ పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది.
ముఖ్యంగా అధినాయకత్వంలోనే మార్పులు చెయ్యాలని చూస్తుంది. చాలా వరకు ఎక్కడ చూసినా సరే చంద్రబాబే కనపడుతున్నారు. కొన్ని షాకులు కూడా వరుసగా తగులుతూ వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను గల్లా జయదేవ్ కి, జాతీయ అధ్యక్ష బాధ్యతలను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కి ఇవ్వాలని చంద్రబాబు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం చంద్రబాబుకి వయసు మీద పడుతుంది. లోకేష్ ప్రజాకర్షణ అనేది ఊహించిన స్థాయిలో కనపడటం లేదు. దీనితో చంద్రబాబు ఇప్పుడు నాయకత్వ బాధ్యతలను ఆ ఇద్దరికే ఇవ్వాలని చూస్తున్నారు. ఇద్దరూ కూడా ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలే. దీనితో వారికి ఆ పదవులు ఇస్తే ప్రయోజనం ఉంటుంది అనే భావనలో చంద్రబాబు ఉన్నారు. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.