చంద్రబాబు ఫోన్ లాక్కున్న పోలీసులు, కరెక్ట్ కాదు సార్…!

చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను బలవంతంగా పోలీసులు లాక్కోవడానికి ప్రయత్నించారు. కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు తన పర్యటన అడ్డుకున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి వెళ్తానని పోలీసులకు చంద్రబాబు వివరించారు. అధికారులను కలిసేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులతో చంద్రబాబు గొడవకు దిగారు.

అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు చంద్రబాబు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు తనకు లేదా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. విమానాశ్రయంలోనే తన నిరసనను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

అరగంట నుంచి విమానాశ్రయంలోనే ఆయన ఉన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేసారు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. చంద్రబాబు నాయుడుని కక్ష సాధింపుతో అడ్డుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.