మోదీకి మద్దతు పలికిన చంద్రబాబు.. ఎందుకంటే..?

-

భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణలో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. దీంట్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహానికి గురువారం మధ్యాహ్నం సూర్యాపేట సమీపంలోని కేసారంలో సంతోష్ బాబు కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు, మరికొందరు సైనికులు ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. అమరవీరులకే కాకుండా, దేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సాయుధ బలగాలకు చెందిన ప్రతి ఒక్కరికీ వందనాలు సమర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సమయంలో మన సాయుధ బలగాలకు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news