ఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు పని ఒకటే…ఎప్పుడు సీఎం జగన్‌ని టార్గెట్ చేసి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం. అయితే ప్రతిపక్ష నాయకుడు అన్నాక, అధికార పార్టీపై విమర్శలు చేయడం సహజమే. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపిస్తూ విమర్శలు చేయాలి. అలా కాకుండా ప్రతి అంశంపై విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు.
అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. జగన్ తీసుకునే నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నారు….జగన్ అమలు చేసే ప్రతి పథకంపై ఆరోపణలు చేయడం కామన్ అయిపోయింది. అలాగే ప్రజా సమస్యల విషయంలో కూడా బాబు లాజిక్ లేకుండా, జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. జగన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తుందని టిడిపి నాయకులు ఫైర్ అయ్యారు.
అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ధరలు పెరగడానికి కారణం…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రెండు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లని పెంచేశాయి. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టాల్సిన అవసరముంది. ఇటీవల తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే అంశంపై ఆందోళన చేస్తూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు.
కానీ చంద్రబాబు మాత్రం కేవలం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదు. అంటే మోదీ ప్రభుత్వం అంటే బాబుకు భయం ఉందని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. ఏదేమైనా బాబు, జగన్‌పైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.