AP Capital: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు షాకిస్తూ.. జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేసిన మెగా స్టార్‌..

-

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మూడు రాజధానుల అంశాన్ని అందరూ స్వాగతించాలని చిరు పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని, ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. ఇప్పుడు అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని అందరిలోనూ ఆందోళన ఉందని అన్నారు.

అయితే, మూడు రాజధానుల అంశంపై నెలకొన్న అపోహలను, అపార్థాలను ప్రభుత్వం తొలగించాలని సూచించారు. మరోవైపే జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటని పవన్ ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులు మూడు పంటలు పండే తమ పొలాలను అమరావతి కోసం ఇచ్చారని తెలిపారు పవన్ కల్యాణ్. ఓవైపు పవన్ జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతుంటే… మరోవైపు చిరంజీవి మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news