ఆరోపణ: వైకాపాతో పోలీసులు, అధికారులు కుమ్మకై ఫలితాలు తారుమారు..

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పోలీసులు, సంబంధిత అధికారులు కుమ్మకై ఫలితాలను తారుమారు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు గెలిచిన చోట అక్కడి అధికారులు ఫలితాలను నిలిపివేసి, కాసేపటి తర్వాత మళ్లీ లెక్కించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని పుసులూరు గ్రామంలో వైకాపా అభ్యర్థి 9 ఓట్లతో ఓడిపోగా, ఆ ఫలితాలు ఆపేశారన్నారు. దీంతో పాటు కర్నూల్‌ జిల్లా నందవరం మండలం మిట్టసోమాపురం పంచాయతీలో ప్రతిపక్ష మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఒక్క ఓటుతో గెలువగా ఆ ఫలితాన్ని సైతం నిలిపేశారని.. ఆ తర్వాత మళ్లీ ఓట్లు లెక్కించకుండానే వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని పేర్కొన్నారు.ఈ విషయాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌కు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈసీకి ఫిర్యాదు..

కొంతమంది పోలీసులు, అధికారులు కుమ్మకై అర్ధరాత్రి వరకూ ఫలితాలు లెక్కిస్తూ .. వైకాపా గెలిచినట్లు ప్రకటిస్తున్నారని .. ఈ విషయమై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొంతమంది పోలీసులు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ప్రతిపక్ష పార్టీల మద్దతున్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాత్రి 10 దాటినా..

నాలుగవ విడతలో 40 శాతం మైనర్‌ పంచాయతీల ఫలితాలు రాత్రి 10 గంటలైనా ప్రకటించలేదని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. మైనర్‌ పంచాయతీల్లో తక్కువ ఓట్లు ఉంటాయని దీంతో లెక్కింపు కూడా త్వరగానే అవుతుంది.. కానీ రాత్రి 10 దాటినా ఫలితాలు ప్రకటించకపోవడంతో కావాలనే ఆపేసినట్లు అనుమానం వ్యక్తమవుతుందని లేఖలో ఫిర్యాదు చేశారు.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...