కాసేపట్లో కేబినెట్ భేటీ.. సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం!

-

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్యర్యంలో మంగళవారం కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రులు అందరూ ఈ భేటీలో పాల్గొనాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా కట్టడిపై మంత్రుల సూచనలు, సలహాలను సీఎం జగన్ తీసుకోనున్నారు. అంతేకాదు బుధవారం నుంచి రాష్ట్రంలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రం మొత్తం పగలు కూడా కర్ఫ్యూ విధించనున్నారు. ఈ అంశపై కూడా సమాలోచనలు చేయనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మృతులు కూడా అధిక సంఖ్యలో నమోదు అవుతుడటం మింగుడు పడటంలేదు. మరోవైపు ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు.

అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ అందుతున్నా మృతులు పెరగటం పట్ల జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో కలిపారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసినా కొన్ని ఆస్పత్రులు కాసులకు కక్కుర్తి పడి సరైన వైద్యం అందించలేకపోతున్నాయి. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నారు. సోమవారం అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని ఇప్పటికే అధికారులు, ఆస్పత్రులకు జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో మంత్రులకు ముఖ్యమైన సూచనలు చేయనున్నారు. కరోనా కారణంగా ఈ కేబినెట్ భేటీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news