ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చంద్రబాబుని కాదని జగన్ కి జై కొట్టారు. ఇద్దరు ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత వైసీపీకి జై అన్నారు. తాజాగా మరో ఎమ్మెల్సీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. కర్నూలు జిల్లాకు చెందిన కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేసారు.
కరణం బలరాం ఇచ్చిన షాక్‌తో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇవాళ కేయీ ప్రభాకర్ షాక్ ఇవ్వడం తో చంద్రబాబు షాక్ అయ్యారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు షాక్ ఇవ్వగా మరో పది మంది క్యూలో ఉన్నారని, చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాకే చెక్ పడుతుందని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రాజీనామా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్దా రాఘవ రావు కూడా పార్టీ మారడానికి రెడీ అయ్యారు.