జగన్ సొంత జిల్లాలో ఇంత దారుణమా…?

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొంతమంది కీలక నేతలకు ఆయన కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలలో పార్టీ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలకు దిగే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.

jagan

రాజకీయంగా కొంతమంది మంత్రులు కారణంగా పార్టీ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా నష్టపోతుంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాల్లో కీలకమైన కడప జిల్లాలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వద్దకు కొన్ని వాస్తవాలు రావడం లేదని దీనిని కొంతమంది అడ్డుకుంటున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంది.

అందుకే జగన్ ఇప్పుడు కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొంతమందిని నమ్మి ఆయన కొన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తే మున్సిపల్ ఎన్నికలలో వివాదాస్పదంగా వ్యవహరించారని దీని కారణంగా చాలామంది దూరమయ్యారని జగన్ కు పూర్తిస్థాయిలో సమాచారం అందింది. అందుకే సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా కొంతమంది కీలక నేతలను ఆయన పక్కన పెట్టేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news