ప్రభుత్వం నుంచి వాళ్ళను జగన్ పక్కన పెడతారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పడింది. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ మొండి పట్టుదలగా వెళ్లడంతో కొంతమంది నేతలు కూడా ఆయన సలహాలు ఇచ్చే విషయంలో పెద్దగా ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో కాస్త కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

ముఖ్యంగా హైకోర్టు విషయంలో జగన్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు .2019 లో గెలిచిన తర్వాత హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గెలిచిన కేసులు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఒకటి రెండు కేసులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది న్యాయసలహాదారులు సమర్థవంతంగా పని చేయడం లేదని అలాగే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఇబ్బందికరగా వ్యవహరిస్తున్నారని జగన్ భావిస్తున్నారు.

అందుకే కొన్ని కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కొంతమంది అధికారులు విషయంలో కూడా జగన్ ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారు. లాయర్లు కూడా సమర్థవంతంగా వాదించలేని పరిస్థితుల్లో ఉన్నారు అని జగన్ సీరియస్ గా ఉన్నారు. అందుకే ఇప్పుడు కాస్త కఠినంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమందిని ప్రభుత్వం నుంచి పక్కనపెట్టి అవకాశం ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news