జగన్ అదిరిపోయే ప్లాన్, వ్యూహం టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్…!

-

ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు శాసన మండలికి చేరింది. దీనితో ఈ బిల్లు ఇక్కడ కీలకంగా మారింది. రాజధానిని మార్చాలని భావిస్తున్న ప్రభుత్వానికి ఇప్పటికే శాసన సభలో ఆమోదం పొంది పరిస్థితులు సానుకూలంగా మారగా ఇప్పుడు మండలిలో మాత్రం పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. మండలిలో విపక్ష తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉన్న నేపధ్యంలో ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనేది ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.

రాజధాని అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రెండూ శాసన మండలికి రావడంతో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏ విధంగా ఆమోదం పొందుతుంది అనే ఆసక్తి నెలకొంది. మండలిలో ఎవరి బలం ఎంత ఉందో ఓ సారి చూస్తే.. ఛైర్మన్‌తో కలిపి మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే మండలిలో ఆమోదం కోసం అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశ౦ ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తున్నారని మండలి టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మండలికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అసలు చర్చ జరగకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ఆయన మండిపడ్డారు. బిల్లు కంటే ముందు చర్చ జరగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news