కేసీఆర్ బాదుడు షురూ: ఇక ప్రజలకు చుక్కలేనా?

-

ఉమ్మడి ఏపీ విడిపోయాక…తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఏర్పడగా, అటు ఏపీ ఏమో లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడింది. అంటే అధిక ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత తెలంగాణనే ఉందని సీఎం కేసీఆర్ సైతం అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి రాష్ట్రం ఇప్పుడు ఇంకా ముందుకెళ్లిందా? లేదా వెనుకబడిందా? అంటే అది రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే అర్ధమైపోవాలి. ఏడున్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో అప్పులు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం పెరుగుదలలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

పైగా వరుసపెట్టి ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ వస్తున్నారు. ఏపీలో అంటే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అక్కడ సీఎం జగన్… ప్రజలపై అనేక విధాలుగా ధరలు, ట్యాక్స్‌ల భారం పెంచారు. ఇసుక, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మద్యం ధరలు దారుణంగా పెంచారు. అలాగే ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ అనేక పన్నులు వేసుకుంటూ వస్తున్నారు. కానీ తెలంగాణలో ఇలాంటి భారాలు ప్రజలపై పెద్దగా పడినట్లు లేవు.

అయితే ఇటీవల జగన్ రూట్‌లోనే కేసీఆర్ కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన కూడా ఇక బాదుడు షురూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది…పైగా కొన్ని డిపోలని సైతం క్లోజ్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి పరిస్తితుల్లో ఛార్జీలు పెంచక తప్పడం లేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెబుతున్నారు. అయితే పల్లె వెలుగుకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్, ఆ పై బస్సులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు 30 పైసలు చొప్పున పెంచడానికి రంగం సిద్ధమైంది.

అటు కరెంట్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర డిస్కంల లోటు రూ.10,624 కోట్లు ఉందని తెలుస్తోంది. ఈ లోటుని భర్తీ చేయడానికి కరెంట్ ఛార్జీలు పెంపు తప్పదని తెలుస్తోంది. త్వరలోనే కరెంట్ చార్జీల బాదుడు కూడా మొదలవుతుందని తెలుస్తోంది. మొత్తానికైతే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news