ఈటల రాజేందర్ కు హుజూరాబాద్‌లో ఉన్న పట్టుగురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఆయనే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ప్రతి ఊరు ఆయనకు సుపరిచితమే. ప్రతి కీలక నాయకుడు అక్కడ ఈటల అనుచరుడే. అంతలా ఆయన అక్కడ పాతుకుపోయారు. ఈటలకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో గెలవాలంటే అంత ఈజీ కాదు.
ఇప్పుడు టీఆర్ఎస్‌కు ఇదే పెద్ద సవాల్‌గా మారింది. ప్రజల్లో ఈటల రాజేందర్ కు ఉన్న పేరును ఎదుర్కొని గెలవాలంటే చాలా కష్టపడాలి. ఇందుకు టీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్లాన్ వేస్తోంది. ఊరికో మంత్రిని పంపి మరీ అన్ని పెండింగ్ పనులు చేస్తోంది. ఏది కావాలంటే అది సాంక్షన్ చేస్తున్నారు మంత్రులు.
అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం నిన్న రూ.35కోట్లను హుజూరాబాద్‌కు ప్రత్యేకంగా కేటాయించడం సంచలనంగా మారింది. ఎంత అడిగినా నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు అడగకుండానే ఈ కరోనా సమయంలో అన్ని కోట్లు ఇస్తోందంటే ఈటల భయం బాగానే పెరిగింది టీఆర్ ఎస్‌లో. చూడాలి మరి వీరి ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.