ఫీల్డ్‌లో కేసీఆర్.. క్లారిటీ ఇవ్వలేకపోతున్న కమలం…!

-

తెలంగాణలో ధాన్యం అంశంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ధాన్యం కొనుగోలు అంశంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయనని చెప్పేసిందని, కాబట్టి యాసంగిలో వారి వేయొద్దని సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు సూచించిన విషయం తెలిసిందే. అసలు వానాకాలం పంటని కొనకుండా యాసంగి పంట గురించి పంచాయితీ ఎందుకు పెడుతున్నారని బీజేపీ నేతలు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

KCR-TRS
KCR-TRS

అయితే యాసంగిలో ఉప్పుడు బియ్యం మాత్రం కొనమని కేంద్రం చెప్పిందని, ముడి బియ్యం కొంటుందని, కాబట్టి దానికి సంబంధించిన వరి పంటలని వేయాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా రెండు పార్టీల మాటల యుద్ధం వల్ల రైతులు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వరి వేస్తే ఏం అవుతుందో అనే భయం రైతుల్లో వచ్చింది. దీంతో రైతులు ఆరు తడి పంటల వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక ఈ విషయంలో రైతులు ఏ పార్టీని తప్పుబట్టాలో అర్ధంకాని పరిస్తితిలో ఉండిపోయారు. కానీ కేసీఆర్ ఇక్కడ క్లియర్‌గా బీజేపీని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధమవుతుంది. ధాన్యం అంశంలో బీజేపీని విలన్ చేయాలని చూస్తున్నారు. కానీ కేసీఆర్‌కు బీజేపీ పూర్తి స్థాయిలో కౌంటర్లు ఇవ్వలేకపోతుందనే చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ క్షేత్ర స్థాయిలో రైతులకు చేరే విధంగా మాట్లాడుతున్నారు…కానీ బీజేపీ నేతలు తమ మాటలని రైతుల వరకు చేర్చలేకపోతున్నారు.

తాజాగా కూడా కేసీఆర్..వనపర్తి జిల్లాలో పలు చోట్ల రైతుల దగ్గరకు నేరుగా వెళ్ళిపోయారు. ఆరుతడి పంటలని పండిస్తున్న రైతులతో మాటామంతీ పెట్టారు. అలాగే యాసంగి వడ్లు కేంద్రం కొనని అంటుందని, అందుకే ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్నారు. అంటే కేసీఆర్ క్షేత్ర స్థాయిలో బీజేపీ వల్లే ఇబ్బంది అన్నట్లు చెబుతున్నారు. కానీ బీజేపీ నేతలు క్షేత్ర స్థాయిలో రైతులకు పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారనే చెప్పొచ్చు. దీని వల్ల బీజేపీనే రైతుల దృష్టిలో విలన్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news