సినీ పరిశ్రమకు కేసీఆర్ ఇచ్చిన వరాలు ఇవే…!

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణా సిఎం కేసీఆర్ మేనిఫెస్టో ని విడుదల చేసారు. కాసేపటి క్రితం ఆయన మేనిఫెస్టో ని విడుదల చేస్తూ సినీ పరిశ్రమకు శుభవార్తలు చెప్పారు. అన్ని రకాల సినిమా థియేటర్లలో షో లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. 40 వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు ఇస్తామని ఆయన ఆయన చెప్పారు.

10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు కచ్చితంగా జీఎస్టీ మినహాయింపు ఇస్తామని ఆయన అన్నారు. దేశంలోనే హైదరాబాద్ సెక్యులర్ నగరం అని ఆయన అన్నారు. సెలూన్ లకు వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉచిత నీటి పథకం కూడా అందిస్తున్నామని నీటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి మంచి నీటి పన్ను ఉండదు అని ఆయన స్పష్టం చేసారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news