సెంటిమెంట్ … ఆయింట్మెంట్ : “బక్క” కేసిఆర్

-

ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో… ఆ దెబ్బకు  ఆయింట్మెంట్ ఎలా పూయాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. టీఆర్ఎస్ ఆవిర్భావం దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతి దశలోనూ ఆయన సెంటిమెంటును రగిల్చి,  దానిని ఓట్ల రూపంలోకి మార్చుకుని సక్సెస్ అయ్యారు. అయితే దుబ్బాక లో మాత్రం ఆ ఫార్ములా పనిచేయలేదు. ప్రస్తుతం గ్రేటర్ వార్ లో బిజెపి గట్టి పోటీ ఇస్తూ ఉండడం తో కెసిఆర్ అలర్ట్ అయ్యారు. తాజాగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ రాజకీయ ప్రత్యర్థులపై సంచలన విమర్శలు చేయడంతో పాటు,  సెంటిమెంట్ రగిల్చి గ్రేటర్ వాటర్ లో టిఆర్ఎస్ పార్టీపై సానుభూతి పెరిగే విధంగా అన్ని రకాలుగా అనేక అంశాలను తన ప్రసంగాలలో వినిపించారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అన్ని పథకాల గురించి కెసిఆర్ గొప్పగా చెప్పుకున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యమైన వాటిని ప్రస్తావించారు. 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులను రద్దు చేశామని, ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణ మాత్రమే బిల్లును రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో ఉన్న ప్రతి బిడ్డ తన బిడ్డ అని ..ఎక్కడా కుల, మత ప్రాంతీయ వివక్ష లేకుండా ముందుకు వెళ్తున్నాం అన్నారు. కరెంటు సమస్యలు అధిగమించి 24 గంటల కరెంటు , మంచినీరు ఇవ్వాలి అనేదే మా లక్ష్యం అంటూ కెసిఆర్ ఎన్నో అంశాలను ప్రస్తావించారు.
కెసిఆర్ కిట్టు సూపర్ హిట్ అంటూ పంచ్ డైలాగులు  పేల్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ను ముంచెత్తిన వరదల పైన కెసిఆర్ మాట్లాడారు. వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి అని, ఎన్నో నగరాలకు ఇటువంటి కష్టాలు ఎదురయ్యాయని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా ప్రజల దగ్గరికి వెళ్లి సహాయ కార్యక్రమాలు అందించారని , ఆ దృశ్యాలను చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అని కెసిఆర్ సెంటిమెంట్ రాజేశారు. ప్రతి ఇంటికీ పదివేలు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రస్తావించారు.
బిజెపి జాతీయ నాయకులతో పాటు, ఆ పార్టీలోని కీలక నాయకులంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కి దిగడంపై కేసీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదిలారు. బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఎంతమంది వస్తారు అంటూ హేళన చేశారు. హైదరాబాద్ లో వరదలు ముంచెత్తాయి కేంద్ర మంత్రులు వరద సహాయం చేయకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వరదల వస్తున్నారని మండిపడ్డారు.
ఇవి స్థానిక సంస్థల ఎన్నికలా ? లేక జాతీయస్థాయి ఎన్నికలా ? బక్క కెసిఆర్ ను కొట్టడానికి ఇంతమందా అంటూ ఎద్దేవా చేశారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news