టార్గెట్ బండి: ఈటలని సైడ్ చేయడానికేనా?

ఒకే ఒక ఫలితం తెలంగాణ రాజకీయాలని పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు అధికారంలో ఉంటూ తిరుగులేదని భావిస్తున్న టీఆర్ఎస్‌కు హుజూరాబాద్ ఉపఎన్నిక పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలాగైనా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపుకు బ్రేకులు వేయాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నించారు. అసలు ఈటలని ఓడించడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కానీ ఈటలని ఓడించడం కేసీఆర్ వల్ల కాలేదు. ఈటల మరోసారి తన బలం ఏంటో నిరూపించుకున్నారు. అయితే హుజూరాబాద్ ఫలితం తర్వాత టీఆర్ఎస్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇంతకాలం ఏ మాత్రం మీడియా ముందుకురాని సీఎం కేసీఆర్..ఇప్పుడు వరుసపెట్టి మీడియా సమావేశాలు పెడుతూ…బీజేపీపై విరుచుకుపడుతున్నారు. అది కూడా కేవలం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌గానే మాట్లాడుతున్నారు. కేసీఆర్ జైలుకు వెళ్తారని, ఆయన ఫార్మ్ హౌస్ లక్ష నాగళ్ళతో దున్నుతామని, కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌ల తాగి పడుకుంటున్నారని బండి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పుడో చేసిన విమర్శలకు కేసీఆర్ ఇప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే సడన్‌గా ఇప్పుడు బండికి కౌంటర్లు ఇవ్వడానికి కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ తెలివిగానే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ వేరే బీజేపీ నేతల పేర్లు తీయడం లేదు..కేవలం బండినే టార్గెట్ చేశారు. అలాగే కాంగ్రెస్‌పై కూడా విమర్శలు చేయడం లేదు.

ఇలా బండినే టార్గెట్ చేయడానికి కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు…హుజూరాబాద్ తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లు రాజకీయం మారింది. అంటే భవిష్యత్‌లో కేసీఆర్‌కు చెక్ పెట్టేది ఈటల అన్నట్లుగా. కానీ కేసీఆర్..ఈటల టాపిక్ సైడ్ చేస్తున్నారు. కేవలం బండి పేరుని హైలైట్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ వర్సెస్ బండి అన్నట్లు…ఇలా రాజకీయం ఉంటే తనకు ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు…ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు ఉంటుంది. దాని వల్ల ఈటల పేరు తెరపైకి రాదు. ఒకవేళ ఈటల పేరు వస్తే తనకు రాజకీయంగా ఇబ్బంది తప్పదనే కోణంలో కేసీఆర్ రాజకీయం నడుపుతున్నారు.