ఖమ్మంపై హస్తం పట్టు తప్పుతుందే..పట్టించుకునేదెవరు?

-

తెలంగాణలో ఉన్న అన్నీ జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఖమ్మం జిల్లా ఒక ఎత్తు అనే చెప్పాలి. ఏపీకి దగ్గరగా ఉన్న ఈ జిల్లాలో కాస్త తెలంగాణ కంటే ఏపీ సంస్కృతి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే రాజకీయ పరంగా అన్నీ జిల్లాల్లో తెలంగాణ సెంటిమెంట్ తో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటితే..ఖమ్మంలో జిల్లాలో మాత్రం బి‌ఆర్‌ఎస్ రాజకీయం వర్కౌట్ అయ్యేది కాదు. గత రెండు ఎన్నికల్లోనూ ఖమ్మంలో గులాబీ పార్టీకి చావు దెబ్బలే తగిలాయి.

Revanth Reddy: CS has become KCR's confidant

గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ హవానే..కానీ ఖమ్మంలో కాంగ్రెస్ హవా నడిచింది. పైగా ఇక్కడ టీడీపీ కూడా స్ట్రాంగ్. అందుకే 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లలో కాంగ్రెస్-టీడీపీ పొత్తులో 8 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 6, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ తో వైరలో ఇండిపెండెంట్ గెలిచారు. కేవలం ఒక ఖమ్మం అసెంబ్లీ మాత్రమే బి‌ఆర్‌ఎస్ స్వల్ప మెజారిటీతో దక్కించుకుంది.

అయితే అధికారంలోకి వచ్చాక బి‌ఆర్‌ఎస్ అక్కడ కాంగ్రెస్, టీడీపీలని దెబ్బతీస్తూ ముందుకెళ్లింది. 4 గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని లాగేసుకున్నారు.

దీంతో ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ లీడ్ పెరిగింది. అలా అని ఖమ్మంలో కాంగ్రెస్ బలం తక్కువ కాదు. కానీ నిదానంగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పట్టు తగ్గుతుందా? అనే పరిస్తితి. నేతలు పూర్తి స్థాయిలో దూకుడుగా పనిచేయకపోవడం, మరోవైపు బి‌ఆర్‌ఎస్ రాజకీయంగా బలపడటం, అటు బి‌జే‌పి సైతం ఖమ్మంలో కీలక నేతలని లాగాలని బలపడాలని చూస్తున్న తరుణంలో ఖమ్మంలో కాంగ్రెస్ పట్టు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా పట్టున్న జిల్లాపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసి పనిచేస్తున్నట్లు లేదు..పెద్దగా పట్టించుకోవడం లేదు. దీని వల్ల జిల్లాలో కాంగ్రెస్‌కు డ్యామేజ్ పెరిగేలా ఉంది. ఇప్పటికైనా మేలుకుని నేతలు కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ ఖమ్మంలో సత్తా చాటవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news