కాంగ్రెస్ సీనియర్ల సీట్లు ఫిక్స్..ఈ సారి గెలుస్తారా?

-

రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ లో ఉన్నంత అంతర్గత ప్రజస్వామ్యం మరో పార్టీలో ఉండదనే చెప్పాలి. ఆ పార్టీలో నాయకులు స్వేచ్చగా మాట్లాడతారు..ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తారు..అవసరమైతే సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేసుకుంటారు. అంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ రాజకీయం ఉంటుంది.  ఇక ఆ పార్టీ నేతలు ఎవరికి నచ్చిన విధంగా వారు ఉంటారు. అలాగే పార్టీలో ఉన్న సీనియర్లు..తమకు కావల్సిన సీట్లని తీసుకుంటారు.

సీనియర్ల నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా కాదనేది చెప్పాలి. అందుకే ఆ పార్టీలో నచ్చిన విధంగా సీట్లని ఎంచుకుంటారు. ఇప్పటికే పలువురు సీనియర్లు తమకు కావల్సిన సీట్లని ఎంచుకున్నారు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఇప్పటికే కొడంగల్ బరిలో ఉంటానని చెప్పారు. గతంలో ఆయన రెండుసార్లు టి‌డి‌పి నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. అయితే అధిష్టానం ఆదేశాలతో ఈ సారి కొడంగల్ బరిలోనే ఉండాలని రేవంత్ డిసైడ్ అయ్యారు.

 

ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తాను పోటీ చేసే సీటు క్లారిటీ ఇచ్చారు. హుజూర్‌నగర్ బరిలో దిగడానికి రెడీ అయ్యారు. ఆయన భార్య పద్మావతి కోదాడలో పోటీ చేయనున్నారు. ఇక జానారెడ్డి నాగార్జున సాగర్ లో పోటీ చేస్తారు..లేదంటే ఆయన తనయుడు పోటీ చేస్తారు. అటు మిర్యాలగూడ సీటులో జానారెడ్డి మరో తనయుడు పోటీ చేయనున్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ పోటీ చేస్తారు.

ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీ బరిలో దిగడానికి రెడీ అయ్యారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో, శ్రీధర్ బాబు మంథనిలో పోటీ చేయనున్నారు. అటు జగ్గారెడ్డి ఏమో సంగారెడ్డిలో, సీతక్క ..ములుగు నుంచి మళ్ళీ బరిలో దిగనున్నారు. పోడెం వీరయ్య భద్రాచలం బరిలో పోటీ చేయనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్లు సీట్లు ఫిక్స్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news