ముచ్చింతల్ లో ఏర్పాటుచేసిన సమతామూర్తి విగ్రహం చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. రాజకీయంగా కొన్ని వైదికంగా కొన్ని వివాదాలు నెలకొంటున్నాయి. ఇవన్నీ మీడియాలో తరుచూ హైలెట్ అవుతున్నాయి. దీంతో వివాదాలకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ విపక్ష పార్టీలు కానీ ప్రవర్తించడం లేదు. ముఖ్యంగా సమతామూర్తి విగ్రహం ఏర్పాటు కన్నా అక్కడికి వెళ్లివస్తున్న రాజకీయ నాయకుల శైలిపైనే ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి దీన్నొక బీజేపీ కార్యక్రమంగానే చూస్తోంది. కాంగ్రెస్ కూడా అలానే చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకూ ఏ నాయకులూ వెళ్లకున్నా కూడా బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరగడంను ఆక్షేపిస్తోంది. ఇక కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. ఎందుకంటే ఆయనకు ఆ రోజు జ్వరం వచ్చింది. కనుక ఆయన ప్రధానిని ఆహ్వానించలేకపోయారు.
నిన్నటి వేళ ఆంధ్రా పొలిటీషియన్ జగన్ వెళ్లారు. చాలా సేపు ఉన్నారు. స్వామి ఇచ్చిన ప్రసాదం స్వీకరించారు. వార్తల్లో నిలిచారు. తిరునామం కూడా ధరించారు. వివాదం ఎందుకంటే ఆయన విశ్వాసాలు వేరుగా ఉంటాయి కనుక. అయినా కూడా స్వామి ఆశ్రమంలో అక్కడి పద్ధతులకు అనుగుణంగానే ఉన్నారు. ఆయన అధికారం,హోదా అన్నవి అటుంచి వెరీ హంబుల్ నేచుర్ లో ఉంటారని స్వామి కీర్తించడం విశేషం.
అంటే జగన్ తన అవసరాలకు అనుగుణంగా ఉంటారు అన్నది తేలిపోయింది. మరి! తిరుపతిలో ఎందుకు డిక్లరేషన్ ఇవ్వరు? అదే అంతుపట్టదు. దీనిపై బీజేపీ మాట్లాడదు. అదేంటో హిందూ ధర్మ ఉద్ధారకులు అంతా జియరు స్వామి ఆశ్రమ ప్రాంగణంలో ఉంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ సమతామూర్తి దగ్గర వంగి వంగి దండాలు పెడుతుండడమే ఇప్పటి చర్చకు కారణం.