దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే చాల మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. సామాన్య ప్రజల నుండి,ప్రజాప్రతినిధులు, సెలెబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే చాల మంది రాజకీయ నాయకులు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు పలువురు మంత్రులు మహమ్మారి బారినపడి కోలుకున్నారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఎం కర్జోల్ కి కరోనా వైరస్ సోకింది.
ఆయన కొంచెం అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తనిఖీ కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ గా తెలిపింది. అయితే ఆయనికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సలహా మేరకు హాస్పిటల్‌లో చేరినట్లు తెలియజేశారు. ఇక ఇటీవల కాలంలో అతనిని కలిసిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అంతేకాదు నిర్బంధంలో ఉండాలని సూచించారు.