కేసీఆర్-కు సీపీఐ కౌంట‌ర్.. అదిరిందిలే !

-

రెండు తెలుగు రాష్ట్రాల‌కూ తెలిసిన క‌మ్యూనిస్టు లీడ‌ర్ నారాయ‌ణ ఇవాళ కొంత సైలెంట్ మోడ్ లో ఉన్నా అప్పుడప్పుడు వైబ్రేటివ్ అలెర్ట్స్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఆవిధంగా కేసీఆర్ కు కొన్ని చురక‌లు అంటిస్తూనే, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ద‌గ్గ‌ర నుంచి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇస్తూ సొంత‌గా నేష‌నల్ పార్టీ పెట్టే దిశ‌గా చేస్తున్న ప్ర‌తిపాద‌న‌ల వ‌ర‌కూ అన్నింటిపై కూడా సీపీఐ నారాయణ స్పందించి., త‌న‌దైన శైలిలో కొన్నింటికి విశ్లేష‌ణ చెప్పారు. బీజేపీయేత‌ర పార్టీల త‌ర‌ఫున ఎప్ప‌టి నుంచో కొంత‌లో కొంత రాజ‌కీయం న‌డుపుతున్న వారిలో నారాయ‌ణ ఉన్నారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో విప్ల‌వ పార్టీల‌లో ఉన్నా కూడా, పూర్తి స్థాయిలో ఆ గొంతుక ఇవాళ వినిపించ‌లేక‌పోతున్నారు.

ఈ ద‌శ‌లో అప్పుడ‌ప్పుడూ మ‌త‌తత్వ పార్టీ బీజేపీ అని విరుచుకుప‌డ‌డం త‌ప్ప, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకునే క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఢీ కొంటూ క్షేత్ర స్థాయిలో ఉద్య‌మాలేవీ సీపీఐ చేయ‌డం లేదు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులతోనూ అంతో ఇంతో రిలేష‌న్స్ అయితే మెంటైన్ చేస్తున్న సీపీఐ నాయ‌కుల‌కు అప్పుడప్పుడూ సంబంధిత ప్ర‌భుత్వాధిప‌తుల దగ్గ‌ర కొంత ప్రాధాన్యం కూడా ద‌క్కుతూ వ‌స్తోంది.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జాతీయ స్థాయిలో రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు కేసీఆర్ సుముఖ‌త చూపుతున్న నేప‌థ్యంలో సీపీఐ ఆయ‌న‌తో క‌లిసి వెళ్తుందా లేదా అన్న విష‌య‌మై మాత్రం పెద్ద‌గా మాట్లాడ‌ని నారాయ‌ణ, దేశ రాజ‌కీయాల్లో ఏ విధంగా న‌డుచుకుంటే బాగుంటుంది అన్న విష‌య‌మై మాత్రం కొన్ని సూచ‌న‌లు చేశారు.

త్వ‌ర‌లో జాతీయ పార్టీ ప్రారంభించ‌బోతున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్య‌క్షులు కే.చంద్ర‌శేఖ‌ర్ రావుకు సీపీఐ నారాయ‌ణ అదిరిపోయే కౌంట‌ర్లు ఇచ్చారు. బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో కూటమి క‌ట్టేందుకు సిద్ధం అవుతున్న త‌రుణాన ఆయ‌న త‌న‌దైన శైలిలో మాట్లాడారు. కేసీఆర్ జాతీయ పార్టీని ఆరంభించ‌డాన్ని ఆహ్వానిస్తున్నామని చెబుతూనే, రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే కొంత కాలం క‌మ్యూనిస్టు పార్టీల‌తో కూడా కేసీఆర్ ప‌నిచేసినందున ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఆయ‌న చేసి ఉంటార‌ని ఇంకొంద‌రు ప‌రిశీల‌కులు అంటున్నారు.

ముందు థ‌ర్డ్ ఫ్రంట్ అని ఇప్పుడు జాతీయ పార్టీ అని ఈ విధంగా తలో ర‌కంగా ఒక్కో క్ష‌ణం ఒక్కో ప్ర‌క‌ట‌న‌ను ఇస్తూ పోతూ ఉన్న కేసీఆర్ కు నారాయ‌ణ మాటల వెనుక ఉన్న అంత‌రార్థం ఏంట‌న్న‌ది అర్థ‌మై ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ విష‌య‌మై త‌రుచూ ఓ విమ‌ర్శ వినిపిస్తూ ఉంటుంది. నిన్న చెప్పిన మాట ఇవాళ ఆయ‌న పాటించ‌రు అని, అదేవిధంగా నిర్ణ‌యాల విష‌య‌మై నిల‌క‌డ ఉండ‌ద‌ని, అదే మాట కు కొన‌సాగింపుగానే నారాయ‌ణ కౌంట‌ర్లు కాస్త న‌ర్మ‌గ‌ర్భంగానే ఉన్నాయి. ఆ విధంగా న‌ర్మ‌గ‌ర్భంగా ఉన్నా కూడా ఇదే నిజం !

ఇదే సంద‌ర్భంలో వ‌ర్త‌మాన రాజ‌కీయ ప‌రిణామాల‌పై నారాయ‌ణ స్పందించారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడుతుంద‌ని, కేసీఆర్‌ కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్న క్రమంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చే రాజకీయ ఎత్తుగడలు వేయాలన్నారు. ఇక ఏపీ సీఎం జగన్‌ సీఎం కేసీఆర్‌కు మంచి మిత్రుడైనందున ఆయనను కూడా కలుపుకొని పోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news