సంజ‌య్ పాద‌యాత్ర‌కు క్రేజ్ తీసుకొచ్చే ప‌నిలో బీజేపీ పెద్ద‌లు.. ప్లాన్ మామూలుగా లేదు

బండి సంజ‌య్ పాద‌యాత్ర ఇప్పుడు తెలంగాణ‌లో పెద్ద సంచ‌ల‌న‌మే రేపుతోంది. మొద‌ట పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా మొద‌లైనా కూడా ఎప్పుడైతే పాత‌బ‌స్తీనుంచి పాద‌యాత్ర‌ను షురూ చేశారో అప్ప‌టి నుంచే పెద్ద ఎత్తున క్రేజ్ వ‌చ్చేసింది సంజ‌య్‌కు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న పాద‌యాత్ర‌పై మెల్లిగా బీజేపీ నేతలు కూడా ఇంకా క్రేజ్ తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా కేంద్ర బీజేపీ పెద్ద‌లు కూడా ఎంట‌ర్ అయిపోయారు. వారు బాగానే స‌పోర్టు చేస్తున్నారు పాద‌యాత్ర‌కు. ఇక ఇప్పుడు మ‌రో ప్లాన్ వేశారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ఇక ఒక్క తెలంగాణ నేత‌ల‌ను తీసుకొస్తే పెద్ద ఎత్తున క్రేజ్ రాద‌ని గ్ర‌హించిన ఢిల్లీ పెద్ద‌లు సంజ‌య్‌కు అండ‌గా నిలిచేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా సంగ్రామ యాత్రకు నిన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ర‌ప్పించారు. ఒక మాజీ సీఎం రావ‌డంతో అనుకున్నంత క్రేజ్ ఈజీగానే వ‌చ్చేసింది. సంజ‌య్ యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ వ‌ర‌కు మాత్ర‌మే క్రేజ్ ఉంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చే ప‌నిలో ప‌డ్డారు.

ఇక వ‌స్తూనే దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కేసీఆర్ మీద ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. బండి సంజ‌య్ యాత్ర తెలంగాణ సరికొత్త మ‌లుపులు తీసుకొస్తుంద‌ని చెప్తున్నారు. కేసీఆర్ కేవ‌లం ఫామ్ హౌస్ కే ప‌రిమితం అవుతార‌ని, కానీ బండి సంజయ్ అలా కాకుండా ప్ర‌జ‌ల కోసం, రైతుల కోసం పాద‌యాత్ర చేస్తున్నార‌ని చెప్పారు. ఇక రైతుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించ‌డం కూడా బీజేపీకి బాగానే ప్ల‌స్ అయిపోయింది. మొత్తానికి సంజ‌య్ పాద‌యాత్ర అటు బీజేపీతో పాటు ఇటు రాష్ట్ర పార్టీల్లో కూడా పెను సంచ‌ల‌న‌మే రేపుతోంది. మ‌రి ముందు ముందు ఇంకెవ‌రు వ‌చ్చి మ‌ద్ద‌తిస్తారో చూడాలి.