బ్రేకింగ్‌ : బీజేపీతో వైసీపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి..!

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గ‌డ‌ప‌డంతో కొత్త కొత్త ఊహాగ‌ణాలు తెరపైకి వ‌చ్చాయి. ఏపీలో వైసీపీ-బీజేపీ జత కడుతున్నాయంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు.. ఈ చేరిక అనంతరం వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా కేంద్రం ఇస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఇప్పటికే బీజేపీ నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసినా ఈ ఊహాగ‌ణాల‌కు బ్రేకులు ప‌డ‌డం లేదు. అయితే తాజాగా వైసీపీ, బీజేపీతో పొత్తుపై స్పందించారు ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు.

వైసీపీతో బీజేపీ పొత్తు లేదని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీతో తప్ప తమకు మరే ఇతర పార్టీతోనూ పొత్తు లేదని, రాష్ట్రంలో తాము జనసేనతోనే కలిసి పనిచేస్తామని చెప్పారు. జగన్ వి ఒంటెద్దు పోకడలని, శాసనమండలి రద్దు భావ్యం కాదని పురందేశ్వరి విమర్శించారు. పీపీఏల రద్దు నుంచి రాజధాని మార్పు నిర్ణయం వరకు జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా సరైన పాత్ర పోషించడంలేదని ఆమె విమర్శ‌లు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news