అక్కడ వైసీపీ కొంపముంచింది వాళ్లేనా… టీడీపీని లేపారుగా!

అసలు ఏపీలో అధికార వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. ఆ ఎన్నికలు, ఈ ఎన్నికలు అనే తేడా లేకుండా అన్నీ ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూనే ఉంది. తాజాగా 12 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ హవా స్పష్టంగా నడిచింది.

ysrcpandtdp
ysrcpandtdp

అయితే 11 మున్సిపాలిటీలు ఒక దారి అయితే, దర్శి మున్సిపాలిటీ ఒక దారి అన్నట్లు ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ హవా కొనసాగింది. దీంతో వేరే చోట వైసీపీ ఓటమిని ఎవరూ ఊహించరు. కానీ ఊహించనదే జరిగింది. దర్శి మున్సిపాలిటీలో టీడీపీ అదిరిపోయే విజయం సాధించింది. అసలు దర్శిలో టీడీపీ గెలుస్తుందని, టీడీపీ నేతలే ఊహించి ఉండరు. ఎందుకంటే అది వైసీపీ కంచుకోట.

అలాంటి చోట టీడీపీ సత్తా చాటింది. దర్శి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే టీడీపీ 13, వైసీపీ 7 చోట్ల మాత్రమే గెలిచింది. పైగా వైసీపీ గెలిచిన ఏడు వార్డుల్లో ఒక వార్డు ముందే ఏకగ్రీవమైంది. అంటే ఆరు చోట్లే గెలిచింది. ఇలా వైసీపీ ఘోరంగా ఓడిపోవడం దర్శి వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం దర్శి వైసీపీ నేతలే అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్లే ఓడిపోయే పరిస్తితి వచ్చింది.

దర్శిలో మొదట నుంచి వైసీపీ ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అసలు పడటం లేదు. దీనికి తోడు మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఈయన 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున దర్శి నుంచి గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో దర్శిలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావు కూడా వైసీపీలోకి వచ్చారు.

దీంతో వైసీపీలో నాయకులు ఎక్కువయ్యారు…అందుకు తగ్గట్టే ఆధిపత్య పోరు పెరిగింది. ఫలితంగా దర్శి మున్సిపాలిటీలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అటు టీడీపీ తరుపున ఇంచార్జ్ పమిడి రమేష్ కష్టపడి పార్టీని గెలిపించుకున్నారని చెప్పొచ్చు.