కంచుకోటల్లో సైకిల్‌కు పంక్చర్లు.. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకే ఛాన్స్?

ఏపీలో అధికార వైసీపీ హవా నడుస్తూనే ఉంది. 2019 ఎన్నికల దగ్గర నుంచి చూసుకుంటే…ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వరకు వైసీపీ వన్ సైడ్ విజయాలు సాధిస్తూనే వస్తుంది. అసలు టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు…ఇలా అన్నిటిల్లోనూ వైసీపీ హవా కొనసాగుతుంది.

ysrcpandtdp
ysrcpandtdp

చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు కంచుకోట కుప్పం…అక్కడ టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో ఎలాగో చిత్తు అయింది. ఇప్పుడు కీలకంగా భావించిన కుప్పం మున్సిపాలిటీలో సైతం టీడీపీ చిత్తుగా ఓడింది. అంటే దీని బట్టి చూస్తే కుప్పంలో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చిందని అర్ధమవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కుప్పంలో బాబుకు గెలిచే అవకాశాలు తగ్గిపోయాయి.

కుప్పంతో మరో రెండు కంచుకోటల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కుప్పంతో పాటు ఉండి నియోజకవర్గం కూడా టీడీపీ కంచుకోటే. ఇక్కడ టీడీపీ కేవలం 2004 ఎన్నికల్లోనే ఓడిపోయింది. 1983, 1985, 1989, 1994, 1999, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీదే గెలుపు. అలాంటి చోట ఇప్పుడు వైసీపీ హవా మొదలైంది.

ఎలాగో స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక కీలకమైన ఆకివీడు నగర పంచాయితీలో కూడా వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే టీడీపీకి మరో కంచుకోటగా ఉన్న పెనుకొండలో వైసీపీ హవా కంటిన్యూ అవుతుంది. తాజాగా జరిగిన పెనుకొండ మున్సిపాలిటీలో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా టీడీపీ కంచుకోటల్లో సైకిల్‌కు వరుసగా పంక్చర్లు పడిపోతున్నాయి. ఇదే పరిస్తితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే…ఈ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం ఖాయం.